భార్య పేరుతో రెస్టారెంట్ ను ప్రారంభించిన మహేశ్ బాబు

Mahesh Babu enters food business
  • ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన మహేశ్ బాబు
  • తెలంగాణ భవన్ పక్కన ఏఎన్ పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు
  • ఈరోజు నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్న రెస్టారెంట్
సూపర్ స్టార్ మహశ్ బాబు సినిమాలతో పాటు ఇతర వ్యాపారాలను సైతం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏషియన్ గ్రూప్స్ తో కలిసి ఏఎంబీ సినిమాస్ ను ఆయన ప్రారంభించారు. తాజాగా ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఏఎన్ పేరుతో రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఏ అంటే ఏషియన్... ఎన్ అంటే ఆయన భార్య పేరు నమ్రత అని చెపుతున్నారు. బంజారాహిల్స్ లో తెలంగాణ భవన్ పక్కనున్న ప్యాలస్ హైట్స్ లో ఈ రెస్టారెంట్ ను ప్రారంభించారు. పూజాకార్యక్రమాలతో నమ్రత రెస్టారెంట్ ను ఓపెన్ చేశారు. 

ఈరోజు నుంచి రెస్టారెంట్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. రెస్టారెంట్ ఎంతో గ్రాండ్ గా ఉంది. ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయని చెపుతున్నారు. దుబాయ్ లో ఉన్న మహేశ్ బాబు ఈరోజు రెస్టారెంట్ కు రానున్నట్టు సమాచారం. ఫుడ్ బిజినెస్ లో మహేశ్ బాబు ఎంతమేరకు రాణిస్తారో వేచి చూడాలి.
Go Back to Shorts
Mahesh Babu
Tollywood
Restaurant
Namrata
AN

More Telugu News