అలీ కుమార్తె ఫాతిమా పెళ్లి రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్
Add ap7am to your home Screen

అలీ కుమార్తె ఫాతిమా పెళ్లి రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్

CM Jagan attends Ali daughter Fatima wedding reception
  • గత ఆదివారం అలీ కుమార్తె వివాహం
  • నేడు గుంటూరులో రిసెప్షన్
  • శ్రీ కన్వెన్షన్ లో వివాహ విందు
  • వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
టాలీవుడ్ సీనియర్ కమెడియన్, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ కుమార్తె ఫాతిమా, షేక్ షెహయాజ్ ల వివాహం గత ఆదివారం హైదరాబాదులో వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో, తమ కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమాన్ని అలీ దంపతులు నేడు గుంటూరులో ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి తన ఆశీస్సులు అందించారు. కాగా, ఈ రిసెప్షన్ కార్యక్రమం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. ఈ వివాహ విందుకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యారు. పలువురు రాష్ట్ర మంత్రులు కూడా హాజరైనట్టు తెలుస్తోంది.
Advertisement
Jagan
Ali
Fatima
Reception
Guntur
YSRCP
Andhra Pradesh

More Telugu News