Ram Charan: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా

Buchibabu Sana set to direct Ram Charan
షార్ట్స్‌లో చూడండి
'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు సానా తన రెండో సినిమాతో జాక్ పాట్ కొట్టేశాడు. ఏకంగా రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. తన శిష్యుడు బుచ్చిబాబు సానా, హీరో రామ్ చరణ్ కాంబోలో ఓ పవర్ ఫుల్ సబ్జెక్టుతో పాన్ ఇండియా సినిమా వస్తోందని స్టార్ డైరెక్టర్ సుకుమార్ వెల్లడించారు. కొన్నిసార్లు తిరుగుబాటు అనేది అవసరంగా మారుతుంది అంటూ ఈ సినిమా కథలో ఉన్న లోతును వివరించే ప్రయత్నం చేశారు. 

వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై తొలి చిత్రంగా ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కూడా ఈ చిత్రంలో భాగస్వాములని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్... శంకర్ దర్శకత్వంలో ఆర్సీ-15ని పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రాజెక్టును మొదలుపెట్టనున్నారు.
Go Back to Shorts
Ram Charan
Buchibabu Sana
Vriddhi Cinemas
Venkata Satish Kilaru
Sukumar
Tollywood

More Telugu News