ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో హన్సిక, సోహెల్
- కాబోయే భర్తతో కలిసి హన్సిక ఫొటోషూట్
- ఎరుపు రంగు దుస్తులతో మెరిసిన జంట
- వచ్చే నెల 4న జైపూర్ కోటలో వివాహం
వచ్చే నెల 4న హన్సిక, సోహెల్ ల పెళ్లి రాజస్థాన్ లో జరగనుంది. జైపూర్ లో 14వ శతాబ్దంలో నిర్మించిన ముండోటా కోటలో జరిగే వివాహ వేడుకతో ఈ జంట ఒక్కటవ్వనున్నారు. డిసెంబర్ 3న మెహందీ వేడుక జరగనుందని సమాచారం. ఇక పెళ్లి రోజు ఉదయం హల్దీ వేడుక నిర్వహించి, వివాహం పూర్తయ్యాక సాయంత్రం క్యాసినో పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.