టీమిండియా అండర్-19 జట్టుకు ఎంపికైన భద్రాచలం అమ్మాయి త్రిష
- మహిళల క్రికెట్లో చిచ్చరపిడుగు గొంగడి త్రిష
- ఎనిమిదేళ్లకే జిల్లా స్థాయి జట్టుకు ఎంపిక
- 12 ఏళ్లకే హైదరాబాద్ మహిళల జట్టులో స్థానం
- తాజాగా న్యూజిలాండ్ తో సిరీస్ కు ఎంపిక
- లెగ్ స్పిన్, పవర్ హిట్టింగ్ తో రాణిస్తున్న త్రిష
త్రిష ఎనిమిదేళ్ల వయసులోనే ఎంతో ప్రతిభ చూపి జిల్లాస్థాయి అండర్-16 జట్టుకు ఆడింది. ఆపై 12 ఏళ్ల వయసులో అండర్-19 జట్టుకు ఆడింది. అంతేకాదు, త్రిష 12 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ మహిళల జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించింది. చిన్న వయసులోనే బీసీసీఐ 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డును గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.
త్రిష ప్రధానంగా లెగ్ స్పిన్నర్. అయితే బ్యాటింగ్ లోనూ తన పవర్ హిట్టింగ్ తో రాణిస్తూ ఆల్ రౌండర్ గా ఎదుగుతోంది. బౌలింగ్ లో అత్యధిక డాట్ బాల్స్ రికార్డు త్రిష పేరిట ఉంది.