గీత సాక్షిగా’ చిత్రం నుంచి ‘అబ్బా అబ్బా ఓ అబ్బాయా’ పాటను విడుదల చేసిన వర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గీత సాక్షిగా’ చిత్రం నుంచి ‘అబ్బా అబ్బా ఓ అబ్బాయా’ పాటను విడుదల చేసిన వర్మ

RGV releases Abba Abba O Abbaya song from Geetha Saakshiga movie
  • ఆంథోనీ మట్టిపల్లి దర్శకత్వంలో గీత సాక్షిగా చిత్రం
  • వర్మ చేతుల మీదుగా అబ్బా అబ్బా ఓ అబ్బాయా సాంగ్ రిలీజ్
  • గోపీసుందర్ సాహిత్యానికి రెహమాన్ సాహిత్యం
  • ఆలపించిన సాహితి చాగంటి
  • చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపిన వర్మ
యువ‌కులు అమ్మాయిల‌పై త‌మ ప్రేమ‌ను వ్య‌క్తం చేసే ప‌ద్ధ‌తులెన్నో! అందులో పాట‌లు కూడా ఉంటాయి. అదే అమ్మాయిలు అబ్బాయిల‌పై త‌మ ఇష్టాన్ని, ప్రేమ‌ను పాట రూపంలో వ్య‌క్తం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా! ఆ కిక్ మ‌రో రేంజ్‌లో ఉంటుంద‌న‌డంలో సందేహ‌మే లేదు. 

తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి పాటలు చార్ట్ బ‌స్ట‌ర్‌లో టాప్‌లో నిలిచి ఓ ఊపు ఊపేశాయి. ఇప్ప‌టికీ ఆ పాట‌ల‌ను మ‌నం హ‌మ్ చేసుకుంటూనే ఉంటాం. అలాంటి మ‌రో సాంగ్ ఆడియెన్స్ మ‌న‌సుని గిలిగింత‌లు పెట్ట‌డానికి మ‌న ముందుకు వ‌చ్చేసింది. 

‘అబ్బా అబ్బా ఓ అబ్బాయా..’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్ కుర్రకారు మనసుని కవ్వించేస్తుంది. ఇంతకీ ఈ పాట ఏ సినిమాలోనో తెలుసా...? ‘గీత సాక్షిగా.. చిత్రంలోనిది. ఆంథోని మట్టిపల్లి దర్శకత్వంలో చేతన్ రాజ్  నిర్మిస్తోన్న సినిమా ‘గీతా సాక్షిగా’. 

ఈ చిత్రంలోని 'అబ్బా అబ్బా ఓ అబ్బాయా' అనే పాటను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. యూనిట్ మెంబర్స్ కు వర్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘అబ్బా అబ్బా ఓ అబ్బాయా..’  సాంగ్ చాలా క్యాచీగా ఉంది. పిక్చరైజేషన్, కొరియోగ్రఫీ చాలా చాలా బావున్నాయి. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌. అంద‌రికీ న‌చ్చేలా సాంగ్ ఉంటుంద‌ని కచ్చితంగా చెప్ప‌గ‌ల‌ను’’ అన్నారు. 

సెకండ్ లిరిక‌ల్ సాంగ్‌గా విడుద‌లైన ‘అబ్బా అబ్బా ఓ అబ్బాయా..’  సాంగ్‌ను విడుద‌ల చేసి స‌పోర్ట్ చేసిన ఆర్జీవీకి చిత్ర యూనిట్ ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసింది. గోపీ సుందర్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమాలోని తాజా పాటను రెహమాన్ రాయగా.. సాహితి చాగంటి హస్కీ వాయిస్‌ తో పాడారు. 

కాగా, ఈ చిత్రంలో ఆదర్శ్, చిత్రా శుక్లా, రూపేశ్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ తదితరులు నటించారు. 

ఇప్పటికే  విడుదలైన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌, మోషన్ పోస్టర్స్, టీజర్‌లతో ఆడియెన్స్‌లో క్యూరియాసిటీతో పాటు సినిమాపై హైప్ పెరిగింది. తాజాగా విడుదలైన సాంగ్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Geetha Saakshiga
Abba Abba O Abbaya
Lyrical Video
RGV
Tollywood

More Telugu News