హైదరాబాదులో కృష్ణ సంస్మరణ కార్యక్రమం... ఫొటోలు ఇవిగో!

Superstar Krishna memorial in Hyderabad
  • సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం
  • నిన్న అంత్యక్రియలు
  • సంస్మరణ కార్యక్రమానికి హాజరైన సినీ ప్రముఖులు 
సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని వీడిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు నిన్న హైదరాబాద్ మహాప్రస్థానంలో జరిగాయి. కాగా, నేడు కృష్ణ సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహేశ్ బాబు, నమ్రత, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఇతర కుటుంబ సభ్యులు, త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, నాగవంశీ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. కృష్ణ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
Go Back to Shorts
Krishna
Memorial
Hyderabad
Mahesh Babu
Tollywood

More Telugu News