టెన్నిస్ లోనూ విజేతగా నిలిచిన కెప్టెన్ కూల్... వివరాలు ఇవిగో
- ఝార్ఖండ్ లో జేఎస్ సీఏ ఆధ్వర్యంలో ఏటా టెన్నిస్ టోర్నీ
- టెన్నిస్ ప్లేయర్ గా ఈ టోర్నీలో పాల్గొంటున్న ధోనీ
- ఇప్పటికే రెండు సార్లు విజేతగా నిలిచిన కెప్టెన్ కూల్
- తాజా గెలుపుతో వరుసగా మూడు టైటిళ్లు గెలుచుకున్న వైనం
ధోనీ సొంత రాష్ట్రం ఝార్ఖండ్ లో ఏటా జేఎస్ సీఏ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతోందట. ఈ టోర్నీలో ఏటా ఓ టెన్నిస్ ప్లేయర్ హోదాలో పాలుపంచుకుంటున్న ధోనీ... ఈ ఏడాది నిర్వహించిన టోర్నీలో ఏకంగా విజేతగా నిలిచాడు. స్థానిక టెన్నిస్ ప్లేయర్ సుమిత్ కుమార్ బజాజ్ తో కలిసి మెన్స్ డబుల్స్ విభాగంలోకి దిగిన ధోనీ విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా టోర్నీ నిర్వాహకుల నుంచి అతడు ట్రోఫీని అందుకున్నాడు. ఈ ఫొటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ టోర్నీలో ఈ ఏడాదే కాదండోయ్... ఇప్పటికే రెండు సార్లు ధోనీ విజేతగా నిలిచాడట. తాజా విజయంతో అతడు వరుసబెట్టి మూడేళ్ల పాటు 3 టైటిళ్లను అందుకున్నాడట.