Ram Charan: అక్షయ్ కుమార్ తో కలిసి డ్యాన్స్ చేసిన రామ్ చరణ్... వీడియో ఇదిగో!

Ram Charan dances with Akshay Kumar at HTLS
షార్ట్స్‌లో చూడండి
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. రామ్ చరణ్ ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి ఉల్లాసంగా డ్యాన్స్ చేశారు. 

తన హిట్ చిత్రం 'రంగస్థలం'లోని 'రంగమ్మ' పాటకు హుషారుగా స్టెప్పులేశారు. అంతేకాదు, అక్షయ్ కుమార్ హిట్ సాంగ్ 'తూ చీజ్ బడీహై మస్త్ మస్త్' సాంగ్, పాత పాట 'యే దోస్తీ'కి కూడా ఇరువురు డ్యాన్స్ చేయడం ఈ లీడర్షిప్ సమ్మిట్ లో అందరినీ అలరించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Go Back to Shorts
Ram Charan
Akshay Kumar
Dance
HTLS
Tollywood
Bollywood

More Telugu News