Karthi: 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పై అడుగుపెడుతున్న 'సర్దార్'

Sardar movie streaming in Aha
షార్ట్స్‌లో చూడండి
మొదటి నుంచి కూడా కార్తి తన సినిమాలను తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు. అందువలన ఆయనను తెలుగు హీరోగానే ఇక్కడి వారు భావిస్తూ ఉంటారు. ఈ కారణంగానే ఇక్కడ ఆయన సినిమాలకి మంచి మార్కెట్ ఉంది. అదే విషయాన్ని 'సర్దార్' సినిమా మరోసారి నిరూపించింది. ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను థియేటర్లలో విడుదలైంది. 

తండ్రీ కొడుకులుగా కార్తి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకి మిత్రన్ దర్శకత్వం వహించాడు. ఈ రెండు పాత్రలకి కథానాయికలుగా రాశి ఖన్నా - రజీషా విజయన్ ఆకట్టుకున్నారు. అటు కోలీవుడ్ లోను .. ఇటు టాలీవుడ్ లోను ఈ సినిమా తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'ఆహా' వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ జరగనున్నట్టుగా ప్రకటిస్తూ, అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు.

'సర్దార్' గా కార్తి లుక్ .. ఆ పాత్ర ఇంట్రడక్షన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. తండ్రీ కొడుకుల పాత్రల మధ్యగల వైవిధ్యం ఈ సినిమా హిట్ కావడంలో ప్రధానమైన పాత్రను పోషించింది. జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచింది. థియేటర్ల నుంచి మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓటీటీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.
Go Back to Shorts
Karthi
Rashi Khanna
Rajeesha Vijayan
Sardar Movie

More Telugu News