Pawan Kalyan: మోదీతో భేటీ కోసం విశాఖ చేరుకున్న జనసేనాని పవన్ కల్యాణ్

Pawan Kalyan arrives Vizag
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు విశాఖ వస్తున్న నేపథ్యంలో, ఆయనతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో, విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కు జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం పవన్ తన వాహనంలో నేరుగా నోవోటెల్ హోటల్ కు పయనమయ్యారు.

పవన్ ఈ రాత్రి 8.30 గంటలకు ప్రధాని మోదీని కలవనున్నారు. ఈ అపాయింట్ మెంట్ ను ఖరారు చేస్తూ పవన్ కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి టెలిఫోన్ ద్వారా సమాచారం అందింది. నేటి సాయంత్రం నుంచి విశాఖలో అందుబాటులో ఉండాలని ఆ సమాచారం సారాంశం. 

కాగా, ప్రధాని మోదీతో భేటీ కోసం పవన్ వివిధ అంశాలపై కసరత్తులు చేసి ఐదు పేజీల నోట్ సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ప్రధానంగా, ఏపీలో బీజేపీతో పొత్తుపై పవన్ మరింత స్పష్టత కోరతారని భావిస్తున్నారు. ఈ దిశగా రోడ్ మ్యాప్ ను అడిగే అవకాశాలున్నాయి. 

ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు వైసీపీ వ్యతిరేక ఓటును టీడీపీకి వెళ్లనివ్వబోమని చెబుతున్న నేపథ్యంలో, వచ్చే ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి పోటీచేస్తాయన్న విషయం అర్థమవుతోంది.
Pawan Kalyan
Vizag
Narendra Modi
Janasena
BJP
Andhra Pradesh

More Telugu News