కేపీహెచ్‌బీలో వ్యభిచార ముఠాపై పోలీసుల మెరుపుదాడి
- పక్కా సమాచారంతో ఓ ఇంటిపై దాడిచేసిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం
- విటుడు, యువతి, అందులో పనిచేసే యువకుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు
- పరారీలో వ్యభిచార గృహ నిర్వాహకుడు
వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు పరారయ్యాడు. అదుపులోకి తీసుకున్న ముగ్గురినీ వారు కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. అనంతరం యువతిని పోలీసులు రెస్క్యూ హోంకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న వ్యభిచార గృహ నిర్వాహకుడి కోసం గాలిస్తున్నారు.