సల్మాన్ ఖాన్ తో బాక్సర్ నిఖత్ జరీన్ సూపర్ డ్యాన్స్.. వీడియో వైరల్
- సల్మాన్ కు వీరాభిమాని అయిన నిఖత్ జరీన్
- ముంబైలో ఆయనను కలిసిన యువ బాక్సర్
- తన కల నిజమైందని ట్వీట్
‘ఎట్టకేలకు నా నిరీక్షణ ముగిసింది. నా కల నిజమైంది’ అని క్యాప్షన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిఖత్ జరీన్ కు చిన్నప్పటి నుంచి సల్మాన్ అంటే చాలా ఇష్టం. ఆమె ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో స్వర్ణ పతకం నెగ్గినప్పుడు అభినందిస్తూ సల్మాన్ ట్వీట్ చేశారు. ఈ విషయం తెలిసి యువ బాక్సర్ ఉబ్బితబ్బిబ్బయిపోయింది. తన గురించి సల్మాన్ ట్వీట్ చేశాడంటే నమ్మలేపోతున్నానని చెప్పింది. ఒక్కసారైనా సల్మాన్‌ను కలుసుకోవాలని ఉందని తెలిపింది. తాజాగా ఆమెకు ఆ అవకాశం లభించింది. వరల్డ్ ఛాంపియన్ షిప్, కామన్వెల్త్ గేమ్స్ లో నెగ్గిన స్వర్ణ పతకాలను సల్మాన్ కు చూపించింది. ఆయనతో సెల్ఫీ తీసుకొని కాసేపు నృత్యం చేసింది.