Tarun: త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా 'నువ్వే నువ్వే' రీ రిలీజ్!

  • ఈ నెల 7వ తేదీన త్రివిక్రమ్ పుట్టినరోజు 
  • ఈ సందర్భంగా 4వ తేదీన 'నువ్వే నువ్వే' రీ రిలీజ్ 
  • తరుణ్ - శ్రియ జంటగా అలరించిన సినిమా ఇది
  • మ్యూజికల్ హిట్ గా నిలబెట్టిన కోటి  
Nuvve Nuvve Movie Re Release

రచయితగా తెలుగు తెరకి త్రివిక్రమ్ పరిచయమయ్యాడు. రచయితగా తన మార్క్ చూపించిన ఆయన, ఆ తరువాత దర్శకుడిగా మెగా ఫోన్ పట్టారు. దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన మొదటి సినిమా 'నువ్వే నువ్వే'. తరుణ్ - శ్రియ జంటగా నటించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ - సునీల్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. అక్టోబర్ 10 - 2002లో విడుదలైన ఈ సినిమా, యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. క్రితం నెలలోనే ఈ సినిమా 20 ఏళ్లను పూర్తి చేసుకుని, సెలబ్రేషన్స్ ను జరుపుకుంది. 

ఈ నెల 7వ తేదీన త్రివిక్రమ్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, 'నువ్వే నువ్వే' సినిమాను ఈ నెల 4వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ రోజు నుంచి 7వ తేదీ వరకూ థియేటర్స్ లో ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. గతంలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న కొన్ని సినిమాలను రీ రిలీజ్ చేయడమనేది ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ గా మారింది. ఇలా థియేటర్స్ కి వస్తున్న కొన్ని సినిమాలకు మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి. 

అలా త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ;'నువ్వే నువ్వే' సినిమా కూడా ప్రేక్షకులను పలకరించనుంది. త్రివిక్రమ్ తయరుచేసుకున్న కథాకథనాలు .. ముఖ్యంగా సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి కోటి సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా 'నా మనసుకేమైంది' అనే పాట విశేషమైన ప్రాచుర్యాన్ని పొందింది. ఇక మిగతా పాటల పరంగా చూసుకున్నా, ఇది మ్యూజికల్ హిట్ అనే చెప్పాలి. మరి రీ రిలీజ్ లో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి.

  • Loading...

More Telugu News