నెదర్లాండ్స్ ను 91 పరుగులకే కట్టడి చేసిన పాకిస్థాన్
- టీ20 వరల్డ్ కప్ లో సూపర్-12 మ్యాచ్
- పెర్త్ లో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్
- విజృంభించిన పాక్ బౌలర్లు
- షాదాబ్ ఖాన్ కు 3, మహ్మద్ వాసిమ్ కు 2 వికెట్లు
ఆ జట్టులో కోలిన్ అకెర్మన్ చేసిన 27 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 15 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. పాక్ బౌలర్లలో స్పిన్నర్ షాదాబ్ ఖాన్ 3 వికెట్లు తీయగా, మహ్మద్ వాసిమ్ జూనియర్ 2, షహీన్ అఫ్రిది 1, నసీమ్ షా 1, హరీస్ రవూఫ్ 1 వికెట్ తీశారు.
ఈ టోర్నీలో సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే పాకిస్థాన్ కు నేటి మ్యాచ్ లో గెలుపు తప్పనిసరి. అందుకే ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టకుండా, నెదర్లాండ్స్ బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేసింది. 92 పరుగుల స్వల్ప లక్ష్యమే కావడంతో పాక్ ఆడుతూ పాడుతూ నెగ్గుతుందని క్రికెట్ పండితులు భావిస్తున్నారు.