Samantha: దీపావళి రోజున కొత్త సినిమాల పోస్టర్ల సందడి!

  • 'యశోద'గా వస్తున్న సమంత 
  • 'రావణాసుర'గా పలకరించనున్న రవితేజ 
  • 'వారసుడు'గా అడుగుపెడుతున్న విజయ్ 
  •  ధనుశ్ ద్విభాషా చిత్రంగా 'సార్'
Deepavali new movie posters released

ఈ రోజున దీపావళి పండుగ కావడంతో ఆయా సినిమాలకి సంబంధించిన అప్ డేట్స్ తో సోషల్ మీడియాలో మంచి సందడి వాతావరణం కనిపిస్తోంది. చాలా వరకూ షూటింగు జరుపుకున్న సినిమాలు టీజర్లు .. ట్రైలర్లు వదులుతూ ఉంటే, మరి కొన్ని సినిమాల నుంచి కొత్త  పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. సమంత నాయిక ప్రధానమైన పాత్రను పోషించిన 'యశోద' .. నవంబర్ 11వ తేదీన విడుదల కానుంది. దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను వదిలారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుశ్ తెలుగు .. తమిళ భాషల్లో ఒక సినిమాను చేస్తున్నాడు. తెలుగులో 'సార్' టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా నుంచి కూడా కొత్త పోస్టర్ ను వదిలారు. తమిళంలో ఈ సినిమాకి 'వాతి' అనే టైటిల్ ను సెట్ చేశారు. సితార బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. విద్యా వ్యవస్థలోని లోపాలపై ఆలోచింపజేసే కథ ఇది.ఇక తమిళ హీరో విజయ్ కూడా తెలుగు .. తమిళ భాషల్లో ఒక సినిమా చేస్తున్నాడు. తెలుగులో 'వారసుడు' .. తమిళంలో 'వరిసు' టైటిల్ తో ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి కూడా తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను వదిలారు. ఇక రవితేజ 'రావణాసుర' నుంచి కూడా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

More Telugu News