'సర్దార్' రెస్పాన్స్ మామూలుగా లేదు: కార్తి

Sardar movie succcess Meet
  • నిన్ననే థియేటర్లకు వచ్చిన 'సర్దార్'
  • స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచిన కథ
  • విడుదలైన ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లు
  • సక్సెస్ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన కార్తి  
కార్తి హీరోగా నటించిన 'సర్దార్' నిన్ననే థియేటర్లకు వచ్చింది. కార్తి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఆయన సరసన నాయికలుగా రాశి ఖన్నా .. రజీషా విజయన్ అలరించారు. పీఎస్ మిత్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలో మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

ఈ వేదికపై కార్తి మాట్లాడుతూ .. మిత్రన్ ఈ సినిమాను చాలా గొప్పగా తెరకెక్కించాడు. ఒక మంచి సినిమాను చేయాలనే ఆశయంతో చేసిన సినిమా ఇది. నేను డైరెక్టర్ ను .. నేను చెప్పిందే మీరు చేయాలనే పద్ధతి మిత్రన్ లో కనిపించదు. ఒక సీన్ చేయడానికి ముందు దానిపై అందరి అభిప్రాయాలు అడిగి మరీ ఒక నిర్ణయానికి వస్తారు. ఈ సినిమాలో ప్రతి సీన్ గొప్పగా రావడానికి అదే కారణం" అన్నాడు. 

"ఒక భారీ బడ్జెట్ సినిమాను చేయడం వేరు .. ఒక భారీ కథను అందరికీ అర్థమయ్యేలా చెప్పడం వేరు. ప్రతి సీన్ ను ఒక సెటప్ తో .. ఇంట్రెస్టింగ్ గా చెప్పడం అంత తేలికైన విషయమేం కాదు. 'సర్దార్' లుక్ కీ .. అతని బాడీ లాంగ్వేజ్ కి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 'ఖాకీ' .. 'ఖైదీ' సినిమాల మాదిరిగానే ఈ సినిమాను కూడా ఆదరించి, కొత్తదనం ఉన్న సినిమాలను సక్సెస్ చేస్తామనే నమ్మకాన్ని మరోసారి కలిగించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు" అంటూ ముగించాడు.
Go Back to Shorts
Karthi
Rashi Khanna
Rajeesha Vijayan
Sardar Movie

More Telugu News