కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది: శశిథరూర్ ఆరోపణ
- ఉత్తరప్రదేశ్ లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపణ
- ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మిస్త్రీకి థరూర్ వర్గం ఫిర్యాదు
- యూపీ నేతల ఓట్లను ఇన్ వాలిడ్ గా ప్రకటించాలని డిమాండ్
3 నుంచి 4 మధ్య ఫలితం..
బ్యాలెట్ బాక్సులలోని ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తం లెక్కించాల్సిన ఓట్లు 9500 కాగా, ఏఐసీసీ కార్యాలయంలో ఏడు నుంచి ఎనిమిది టేబుల్స్ పై కౌంటింగ్ జరుగుతోందని వివరించాయి. ప్రతీ టేబుల్ ముందు ఇద్దరు ఏజెంట్లు కూర్చుని ఓట్లు లెక్కిస్తున్నారని పేర్కొన్నాయి. సాయంత్రం 4 గంటల వరకు కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారని సమాచారం.