Vishwak Sen: విష్వక్సేన్ ను ఆకాశానికెత్తేసిన చరణ్

Ori Devuda Pre Release Event
షార్ట్స్‌లో చూడండి
విష్వక్ సేన్ హీరోగా రూపొందిన 'ఓరి దేవుడా' సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందింది. వెంకటేశ్ ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం 'రాజమండ్రి'లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చరణ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ స్టేజ్ పై చరణ్ మాట్లాడుతూ .. "చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో మీరంతా రావడం ఆనందాన్ని కలిగిస్తోంది. మంచి సినిమాను ఆదరించే మీ గుణాన్ని మరోసారి చాటుకుంటున్నందుకు సంతోషంగా ఉంది" అన్నాడు. 

"అశ్వత్ మారిముత్తు కట్ చేసిన ట్రైలర్ చూశాను .. నాకు చాలా బాగా నచ్చింది. వెంకటేశ్ గారు కామెడీ ఎంత బాగా చేస్తారనేది అందరికీ తెలుసు. ఆయన చూపించే ఇంపాక్ట్ బలంగా ఉంటుందని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన కోసమైనా నేను ఈ సినిమాను చూస్తాను. మిథిలా పాల్కర్ గురించి మీకు తెలియదేమో. తను ఓటీటీ సూపర్ స్టార్. నేను .. ఉపాసన ఇద్దరం కూడా తన ఫ్యాన్స్. ఆమె చేసిన 'లిటిల్ థింగ్స్' అనే సిరీస్ ను మేము ఫాలో అయ్యేవాళ్లం.

విష్వక్సేన్ .. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ ప్రాంతాల్లోని గల్లీ గల్లీలో ఈ పేరు తెలియని వారు లేరు. ఫలక్ నుమా నుంచి రాజమండ్రి వరకూ ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు. విష్వక్ సేన్ కి రెబల్ ఫ్యాన్స్ .. రేజింగ్ ఫ్యాన్స్ ఉన్నారు. విష్వక్ పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యాన్ ని. ఇచ్చిన మాటపై నిలబడే వాళ్లంటే నాకు చాలా ఇష్టం. అలాంటి ఒక పేరు నాకు ఉంది. విష్వక్ కూడా అంతే అనే విషయం నాకు తెలిసింది. ఒక రజనీ గారు .. చిరంజీవిగారు .. పవన్ కల్యాణ్ గారు సూపర్ స్టార్ లు అనిపించుకోవడానికి కారణం వారి వ్యక్తిత్వమే. అలాంటి పర్సనాలిటీ విష్వక్ సేన్ కి నిండుగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.  

Go Back to Shorts
Vishwak Sen
Mithila
Asha
Ori Devuda Movie

More Telugu News