Manchu Vishnu: రేపే 'జిన్నా' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ఎక్కడంటే!

  • మంచు విష్ణు హీరోగా రూపొందిన 'జిన్నా'
  • గ్లామరస్ హీరోయిన్స్ గా పాయల్ .. సన్నీ
  • యాక్షన్ కామెడీ నేపథ్యంలో నడిచే కథ 
  • జెఆర్సీ కన్వెన్షన్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ఈ నెల 21వ తేదీన సినిమా విడుదల  
Ginna Movie Update

మంచు విష్ణు హీరోగా 'జిన్నా' సినిమా రూపొందింది. విష్ణు సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ టచ్ తో కూడిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. విష్ణు సరసన నాయికలుగా పాయల్ .. సన్నీలియోన్ అలరించనున్నారు. ఈ ఇద్దరి అందాల సందడి ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 21వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఖరారు చేశారు. హైదరాబాద్ .. జూబ్లీ హిల్స్ లోని జెఆర్సీ కన్వెన్షన్స్ లో రేపు ఈ వేడుక జరగనుంది. రేపు సాయంత్రం 5:30 గంటల నుంచి ఈ ఈవెంట్ మొదలుకానుంది. 'జిన్నా జాతర' పేరుతో ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. 

గతంలో విష్ణుకి హిట్ ఇచ్చిన దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి కథను అందించగా .. కోన వెంకట్ స్క్రీన్ ప్లే ను సమకూర్చాడు. ఇక ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ కూడా అంచనాలు పెంచేశాయి. సీనియర్ నరేశ్ .. సురేశ్ .. వెన్నెల కిశోర్ .. చమ్మక్ చంద్ర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి మరి.

More Telugu News