అతడు ఎన్టీఆర్ కొడుకేనా అనిపించింది... బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోపై లక్ష్మీపార్వతి స్పందన
Add ap7am to your home Screen

అతడు ఎన్టీఆర్ కొడుకేనా అనిపించింది... బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోపై లక్ష్మీపార్వతి స్పందన

Lakshmi Parvathi slams Balakrishna Unstoppable show episode with Chandrababu
  • అన్ స్టాపబుల్ రెండో సీజన్
  • ఇటీవల చంద్రబాబుతో ఎపిసోడ్
  • తీవ్రంగా స్పందించిన లక్ష్మీపార్వతి
  • బాలకృష్ణను చూస్తే అసహ్యం వేస్తోందని విమర్శలు
నందమూరి బాలకృష్ణ తొలిసారిగా బుల్లితెరపై కనువిందు చేసిన కార్యక్రమం అన్ స్టాపబుల్. ఆహా ఓటీటీలో ప్రసారమైన తొలి సీజన్ విజయవంతం కావడంతో, తాజాగా అన్ స్టాపబుల్-2 షురూ అయింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుపై చిత్రీకరించిన ఎపిసోడ్ పట్ల వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి కూడా దీనిపై స్పందించారు.

తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు, బాలకృష్ణ ఈ షోను ఎంచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాడు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నాడన్నది ఒట్టి అబద్ధమని స్పష్టం చేశారు. నాడు పార్టీలో గొడవలు చేయించింది, ఎమ్మెల్యేలను రెచ్చగొట్టింది, ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా రోడ్ల పైకి పిలిచింది చంద్రబాబేనని స్పష్టం చేశారు. 

ఇక, అన్ స్టాపబుల్-2 తాజా ఎపిసోడ్ చూశాక బాలకృష్ణ అంటేనే రోత పుడుతోందని, అతడు ఎన్టీఆర్ కొడుకేనా అని అసహ్యం కలుగుతోందని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఆ షో చూస్తుంటే, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినవాళ్లు ఒకరినొకరు సమర్థించుకున్నట్టుగా ఉందని విమర్శించారు.
Lakshmi Parvathi
Balakrishna
Unstoppable
Chandrababu
Episode
Aha
NTR

More Telugu News