lawrence: అటు చేసి ఇటు చేసి కాజల్ దగ్గరికెళ్లిన 'చంద్రముఖి 2'

  • షూటింగు దశలో 'చంద్రముఖి 2'
  • లారెన్స్ జోడీగా కనిపించనున్న కాజల్ 
  • సంగీత దర్శకుడిగా కీరవాణి 
  • వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు
kajal in Chandramukhi 2 Movie

జ్యోతిక ప్రధానమైన పాత్రను పోషించిన 'చంద్రముఖి' సంచలన విజయాన్ని సాధించింది. రజనీకాంత్ .. ప్రభు .. నయనతార కీలకమైన పాత్రలను పోషించిన ఆ సినిమాను ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. ఆ సినిమాకి సీక్వెల్ చేయాలని దర్శకుడు పి. వాసు ప్రయత్నించినప్పటికీ, అందుకు రజనీకాంత్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. 

దాంతో ఆ సినిమా సీక్వెల్ ను లారెన్స్ తో చేయడానికి వాసు రంగంలోకి దిగాడు. ఇటీవలే 'చంద్రముఖి 2' టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసి షూటింగును మొదలుపెట్టారు. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉంటారని చెబుతూ, వారిలో 'చంద్రముఖి' ఎవరనే ఆసక్తిని రేకెత్తించారు. టైటిల్ రోల్ కోసం కాజల్ ను సంప్రదించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. 

ఈ సినిమా చేయడానికి కాజల్ అంగీకరించిందనేది తాజా సమాచారం. చారడేసి కళ్లున్న కాజల్ ఈ తరహా పాత్రను బాగా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కీరవాణి ఈసినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా అంతకుమించి అన్నట్టుగా ఉంటుందా అనేది చూడాలి..

More Telugu News