అంతా రెడీ .. ఇక ఆగేదే లేదంటున్న బన్నీ!
- సంచలన విజయాన్ని సాధించిన 'పుష్ప'
- 'పుష్ప 2' కోసం జరుగుతున్న సన్నాహాలు
- నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్
- ఐటమ్ భామగా వినిపిస్తున్న కాజల్ పేరు
ముందుగా అనుకున్న కథలో మార్పులు చేసుకోవడం .. మరికొంతమంది స్టార్స్ ను యాడ్ చేసుకోవడం వలన మరికాస్త ఆలస్యమైంది. ఇక ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేశారట. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారని సమాచారం. ఆ తరువాత నుంచి పెద్దగా గ్యాప్ లేకుండా షూటింగు కానిచ్చేస్తారని అంటున్నారు.
ఈ సినిమాలో రష్మికతో పాటు మరో కథానాయికకి కూడా చోటు ఉంటుందని అంటున్నారు. తమిళం నుంచి విజయ్ సేతుపతిని .. బాలీవుడ్ నుంచి అర్జున్ కపూర్ ను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇక ఇప్పటికే దేవిశ్రీ మాస్ మసాలా ట్యూన్స్ ను సిద్ధం చేశాడని టాక్. ఐటమ్ సాంగులో కాజల్ మెరవనుందనే ప్రచారం కూడా జోరుగానే జరుగుతోంది.