'మైసూర్ బజ్జీ'గా వెన్నెల కిశోర్ .. ఫస్టులుక్ పోస్టర్ రిలీజ్!
- మంచు విష్ణు హీరోగా రూపొందిన 'జిన్నా'
- రొమాంటిక్ కామెడీ టచ్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది
- గ్లామరస్ గా మెరవనున్న పాయల్ - సన్నీలియోన్
- ఈ నెల 21వ తేదీన మూడు భాషల్లో విడుదల
ఆయన పాత్రను పరిచయం చేస్తూ .. ఆయన ఫస్టులుక్ పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఆయన పాత్రలో కామెడీతో పాటు కాస్త రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందనే విషయం ఈ పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించాడు.
సొంత బ్యానర్ పై విష్ణు నిర్మించిన ఈ సినిమాకి, జి.నాగేశ్వరరెడ్డి కథను అందించగా .. కోన వెంకట్ స్క్రీన్ ప్లే ను సమకూర్చాడు. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే జనంలోకి వెళ్లాయి. పాయల్ - సన్నీలియోన్ అందాల సందడి చేసిన ఈ సినిమా, తెలుగు .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది.