కోస్తాంధ్రలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు
- కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
- ఉపరితల ఆవర్తనానికి తోడు ద్రోణి విస్తరణ
- నిన్న కూడా పలు జిల్లాల్లో వర్షం
అలాగే, చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వివరించింది. ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని కూడా పేర్కొంది. నిన్న కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.