'ఆదిపురుష్' హిందీ టీజర్ కు అదిరిపోయే స్పందన

Huge response for Prabhas Adipurush Hindi teaser
  • ప్రభాస్, కృతి సనన్ జంటగా ఆదిపురుష్
  • నిన్న రిలీజైన టీజర్
  • అయోధ్యలో టీజర్ రిలీజ్ ఈవెంట్
  • 19 గంటల్లో 63 మిలియన్ల వీక్షణలు
ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటిస్తున్న భారీ చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా టీజర్ ను నిన్న అయోధ్యలో అట్టహాసంగా జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. కాగా, విడుదలైన కొన్ని గంటల్లోనే ఆదిపురుష్ హిందీ టీజర్ కు విశేషమైన రీతిలో స్పందన వచ్చింది. కేవలం 19 గంటల వ్యవధిలో ఈ టీజర్ ను 63 మిలియన్ల మంది వీక్షించారు. 10 లక్షల లైకులు రావడం విశేషం. 

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదిపురుష్ లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్ర పోషిస్తున్నారు.
Go Back to Shorts
Adipurush
Teaser
HIndi
Prabhas
Kriti Sanan
Om Raut
Bollywood
Tollywood

More Telugu News