ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. 'ఆదిపురుష్'లో రాముడిగా ఫస్ట్ లుక్ వచ్చేసింది!
Add ap7am to your home Screen

ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. 'ఆదిపురుష్'లో రాముడిగా ఫస్ట్ లుక్ వచ్చేసింది!

Prabhas first look in Adipurush released
  • ఈ ఉదయం ట్విట్టర్ లో రిలీజ్ చేసిన దర్శకుడు ఓం రౌత్
  • ఆకాశానికి విల్లు ఎక్కు పెట్టి పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్న ప్రభాస్
  • ఆదివారం ఆయోధ్యలో టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు ఓం రౌత్ ప్రకటన
ప్రభాస్ అభిమానులకు దసరా పండగ ముందే వచ్చేసింది. 'ఆది పురుష్'లో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను చిత్ర దర్శకుడు ఓం రౌత్ శుక్రవారం ఉదయం రిలీజ్ చేశాడు. ఈ చిత్రంలో శ్రీరాముడిగా నటిస్తున్న ప్రభాస్.. ఆకాశానికి విల్లును ఎక్కు పెట్టిన పోస్ట్ అద్భుతంగా ఉంది. పొడవాటి జుట్టు, భుజాలకు రుద్రాక్షలు ధరించిన ప్రభాస్ చాలా గంభీరంగా, పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఓం రౌత్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ ఫస్ట్ లుక్ క్షణాల్లో వైరల్ అయింది. ఈ చిత్రం టీజర్ ను ఆదివారం విడుదల చేస్తున్నట్టు దర్శకుడు ఓం రౌత్ తెలిపాడు. ఉత్తరప్రదేశ్, అయోధ్యలోని సరయూ నది ఒడ్డున టీజర్ లాంచ్ చేస్తామని ప్రకటించాడు. 

ఆదివారం రాత్రి 7.11 గంటలకు టీజర్ విడుదల అవుతుందని, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అభిమానులకు పిలుపునిచ్చాడు. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన సీతాదేవిగా కృతి సనన్ నటించింది. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక పాత్ర పోషించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన పది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Prabhas
adipurush
firstlook
Bollywood

More Telugu News