మనవరాలిని చూసేందుకు బళ్లారి వెళతానన్న గాలి జనార్దన్ రెడ్డి... నిజమో, కాదో తేల్చాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశం
- బళ్లారి వెళ్లేందుకు అనుమతించాలని జనార్దన్ రెడ్డి పిటిషన్
- 2 నెలల పాటు విచారణ వాయిదా వేయడం కుదరదన్న సుప్రీంకోర్టు
- కనీసం నెల రోజుల పాటైనా బళ్లారిలో ఉండేందుకు అనుమతించాలన్న జనార్దన్ రెడ్డి
- విచారణను రేపటికి వాయిదా వేసిన వైనం
తనకు ఇటీవలే మనవరాలు పుట్టిందని, మనవరాలిని చూసేందుకు తనకు 2 నెలల పాటు బళ్లారిలో ఉండేందుకు అనుమతించాలని జనార్దన్ రెడ్డి కోరారు. ఈ కేసులో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిన నేపథ్యంలో రోజువారీ విచారణకు ఆదేశాలు జారీ చేయనున్న ప్రస్తుత తరుణంలో 2 నెలల పాటు విచారణను వాయిదా వేయలేమంటూ కోర్టు తెలిపింది. అయితే కనీసం ఓ నెల పాటైనా తాను బళ్లారిలో ఉండేందుకు అనుమతించాలని ఆయన కోర్టును కోరారు. దీంతో జనార్దన్ రెడ్డి చెబుతున్న విషయాలు వాస్తవమో, కాదో పరిశీలించి తమకు నివేదించాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.