మరోసారి బుర్జ్ ఖలీఫాపై షారూఖ్ ఖాన్!
- ఈసారి షారూఖ్ పుట్టిన రోజుకు ముందే వెలిగిపోయిన భవనం
- స్పాన్సర్ చేసిన యూఏఈ హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడర్ బుర్జీల్ హోల్డింగ్స్
- బుర్జీల్ హోల్డింగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న షారూఖ్
షారూఖ్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఈ సంస్థ యూఏఈలో 39 ఆసుపత్రులు, వైద్య కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో షారూఖ్ ముఖంతో తమ బ్రాండ్‌కు ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా బుర్జ్ ఖలీఫా బిల్డింగ్‌పై షారూఖ్ నటించిన తమ బ్రాండ్ ప్రచార వీడియోను ప్లే చేయించింది. ప్రచార ప్రారంభ కార్యక్రమంలో ముందుగా షారుఖ్ ఖాన్‌కు యూఏఈతో ఉన్న బలమైన అనుబంధాన్ని హైలైట్ చేసింది. 70 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో షారూఖ్ హెల్త్‌కేర్ గ్రూప్ కథను వివరించారు. అంతకుముందు బుర్జ్ ఖలీఫాలోని మ్యూజికల్ ఫౌంటెన్ ఓం శాంతి ఓం సినిమా ట్యూన్‌లను ప్లే చేసింది. దాంతో, సమీపంలోని ప్రజలంతా అక్కడికి చేరుకోగా.. బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ పై ప్రచార వీడియో ప్లే అయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, షారూఖ్ ఖాన్ ఇటీవల బ్రహ్మాస్త్ర చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. వచ్చే ఏడాది షారూఖ్ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ముందుగా పఠాన్ చిత్రం జనవరిలో విడుదల కానుంది. తర్వాత జవాన్, డుంకీ చిత్రాలు విడుదల అవుతాయి.