ఇండియాతో కలిసి డ్రోన్లను అభివృద్ధి చేయనున్న అమెరికా
- ఇండియాతో రక్షణ రంగంలో బంధాన్ని బలోపేతం చేసుకుంటున్న అమెరికా
- ఇండియాకు అన్ని విధాలా సహకరిస్తామన్న పెంటగాన్ సీనియర్ అధికారి
- ఇండియా తయారు చేసే రక్షణ ఉత్పత్తులను మిత్ర దేశాలకు ఎగుమతి చేస్తుందని వ్యాఖ్య
రక్షణ ఉత్పత్తులను దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాలలోని తమ మిత్ర దేశాలకు సరసమైన ధరకు ఇండియా ఎగుమతి చేస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో రక్షణ రంగంలో ఇండియాతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని తెలిపారు. మరోవైపు ఏసియా-పసిఫిక్ రీజన్లో పలు దేశాలతో చైనాకు విరోధం ఉంది. ఈ దేశాలకు ఇండియా రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయనుంది. ఇప్పటికే కొన్ని దేశాలకు ఇండియా నుంచి ఆయుధాలు ఎగుమతి అవుతున్నాయి.