భారీ ధరకు చిరంజీవి 'గాడ్ ఫాదర్' డిజిటల్ రైట్స్
Add ap7am to your home Screen

భారీ ధరకు చిరంజీవి 'గాడ్ ఫాదర్' డిజిటల్ రైట్స్

Netflix owns Chiranjeevi God Father movie rights for Rs 57 Cr
  • అక్టోబర్ 5న విడుదలవుతున్న చిరంజీవి 'గాడ్ ఫాదర్'
  • రూ. 57 కోట్లకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్
  • అనంతపురంలో జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరు గత సినిమా 'ఆచార్య' నిరాశపరిచినప్పటికీ... ఈ చిత్రంపై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకు చెందిన థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే పూర్తయింది. 

తాజాగా సినిమా ఓటీటీ రైట్స్ సైతం భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ రూ. 57 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. తెలుగు, హిందీ వర్షన్ లకు కలిపి ఈ మొత్తాన్ని చెల్లించినట్టు సమాచారం. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 5న విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ వేగవంతం చేసే పనిలో పడింది. అనంతపురం వేదికగా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
Chiranjeevi
God Father Movie
Digital Rights
NetFlixs
Tollywood
Bollywood

More Telugu News