Ajay Devgn: అజయ్ దేవగణ్ సినిమాకు షాకిచ్చిన కువైట్ ప్రభుత్వం

Kuwait bans Ajay devgn movie
షార్ట్స్‌లో చూడండి
అజయ్ దేవగణ్ తాజా చిత్రం 'థాంక్ గాడ్'కు కువైట్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మత విశ్వాసాలను దెబ్బ తీసేలా సినిమా ట్రైలర్ ఉందనే కారణంతో ఈ చిత్రంపై అక్కడి సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాపై నిషేధం విధించింది. అభ్యంతరకరమైన సన్నివేశాన్ని తీసేస్తే... సినిమా విడుదలకు అనుమతిస్తామని తెలిపింది. ఈ సినిమా ఫాంటసీ కామెడీగా తెరకెక్కింది. ఈ చిత్రంలో చిత్రగుప్తుడిగా అజయ్ దేవగణ్ కనిపిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలను పోషించారు. అక్టోబర్ 24న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
Go Back to Shorts
Ajay Devgn
Bollywood
Thank God Movie
Kuwait
Ban

More Telugu News