Thar Maar Thakkar Maar: చిరంజీవి 'తార్ మార్ తక్కర్ మార్' పాట 'స్పాటిఫై'లో విడుదల

God Father song released in Spotify
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'గాడ్ ఫాదర్'. తాజాగా ఈ చిత్రం నుంచి 'తార్ మార్ తక్కర్ మార్' అనే గీతాన్ని పాటల అడ్డా 'స్పాటిఫై'లో విడుదల చేశారు. 

ఈ పాటలో చిరంజీవితో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా స్టెప్పులేయడం విశేషం. దాంతో అందరి దృష్టి ఈ పాటపైనే నిలిచింది. అయితే, ఈ పాట తెలుగు, హిందీ వెర్షన్లను చిత్రబృందం 'స్పాటిఫై' వేదికగా విడుదల చేసింది. లిరికల్ వీడియోను త్వరలోనే పంచుకుంటామని 'గాడ్ ఫాదర్' చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ వెల్లడించింది. 

'తార్ మార్ తక్కర్ మార్' పాటకు తమన్ బాణీలు అందించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. మలయాళ చిత్రం 'లూసిఫర్' కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటిస్తోంది.
Go Back to Shorts
Thar Maar Thakkar Maar
Song
God Father
Chiranjeevi
Salman Khan
Mohan Raja
Spotify
Tollywood
Bollywood

More Telugu News