మేఘాలపై నుంచి స్వర్గానికి వంతెన వేసినట్టుగా.. కశ్మీర్‌ లో చీనాబ్‌ బ్రిడ్జి అందాలు ఇవిగో
Add ap7am to your home Screen

మేఘాలపై నుంచి స్వర్గానికి వంతెన వేసినట్టుగా.. కశ్మీర్‌ లో చీనాబ్‌ బ్రిడ్జి అందాలు ఇవిగో

Bridge look alike built on clouds Here are the beautiful pictures of Chenab Bridge
  • కొత్తగా కట్టిన రైల్వే బ్రిడ్జి ఫొటోలను విడుదల చేసిన రైల్వే శాఖ
  • అందమైన చీనాబ్ బ్రిడ్జి అందాలు ఇవిగో అంటూ ట్విట్టర్ లో పోస్టులు
  • అద్భుతమంటూ నెటిజన్ల కామెంట్లు.. వేలకొద్దీ లైకులు
  • ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన అంటున్న అధికారవర్గాలు
చుట్టూ పెద్ద పెద్ద కొండలు.. మధ్యలో నది.. దానిపై బ్రిడ్జి.. ఓ అందమైన దృశ్యం. అంతటా ఉండే అందం కాదు ఇది.. అసలు భూమి నుంచి మేఘాల మీదుగా స్వర్గానికి మార్గం వేసినట్టున్న అద్భుతమైన దృశ్యమిది. ఇదంతా ఎక్కడో, ఏ యూరోపియన్ దేశాల్లోనో కాదు.. అచ్చంగా మన కశ్మీర్ లో చీనాబ్ లోయలో ఇటీవల కనిపించి అలరించిన దృశ్య కావ్యం. భారత రైల్వే తాజాగా ఈ బ్రిడ్జికి సంబంధించిన చిత్రాలను ట్విట్టర్ లో షేర్ చేసింది.

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన
  • జమ్మూ కశ్మీర్ లో కొత్త రైలు మార్గం కోసం చీనాబ్ నదిపై రైల్వే శాఖ అధునాతన స్టీల్ వంతెనను నిర్మించింది. రేసి జిల్లాలో బక్కాల్ – కౌరి మార్గంలో ఇటీవలే ఈ వంతెన నిర్మాణం పూర్తయింది. ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి. వచ్చే డిసెంబర్ లోనే దాని మీదుగా రైళ్ల రాకపోకలను ప్రారంభించనున్నారు.
  • ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన అని అధికారులు చెబుతున్నారు. చీనాబ్ బ్రిడ్జ్ గా పిలుస్తున్న ఈ వంతెనకు సంబంధించిన చిత్రాలను రైల్వే శాఖ ఇటీవల ట్విట్టర్ లో పెట్టింది. ‘అత్యంత అద్భుతమైన చీనాబ్ వంతెన దృశ్యాలు ఇవి’ అంటూ కామెంట్ పెట్టింది.
  • చీనాబ్ వంతెన చిత్రాలను చూసిన వారు.. ఆ వాతావరణాన్ని, ప్రకృతి అందాలను చూసి నోరెళ్లబెడుతున్నారు. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించాలన్న భావన వ్యక్తం చేసినవారూ ఎందరో.
  • అంత ఎత్తున రైల్వే వంతెన నిర్మించిన రైల్వే శాఖను చాలా మంది అభినందిస్తున్నారు.
Chenab Bridge
Jammu And Kashmir
Bridge
Indian Railways
Twitter

More Telugu News