మహేశ్ బాబు, రాజమౌళిల సినిమా కథ ఇదేనట!
- ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న మహేశ్
- ఈ సినిమా పూర్తయిన వెంటనే పట్టాలెక్కనున్న మహేశ్, రాజమౌళిల సినిమా
- ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథే ఈ సినిమా
మరోవైపు ఈ సినిమా గురించి రాజమౌళి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథే ఈ సినిమా అని ఆయన చెప్పారు. యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా ఇది తెరకెక్కుతుందని అన్నారు. మరోపక్క, ఇప్పటికే ఈ సినిమాపై మహేశ్ బాబు మాట్లాడుతూ... రాజమౌళితో ఒక్క సినిమా చేస్తే 25 సినిమాలు చేసినట్టేనని చెప్పారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతుందని... ఈ చిత్రం జాతీయ స్థాయిలో సరిహద్దులను చెరిపేస్తుందని అన్నారు. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే ఏడాది తెలిసే అవకాశం ఉంది.