టాలీవుడ్ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట విషాదం

Mani Sharma mother Saraswathi passes away
  • మణిశర్మకు మాతృవియోగం
  • మణిశర్మ తల్లి సరస్వతి కన్నుమూత
  • సరస్వతి వయసు 88 సంవత్సరాలు
  • వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న సరస్వతి
ఇప్పటికే చిత్ర పరిశ్రమ పెద్ద అనదగ్గ కృష్ణంరాజు మృతితో తల్లడిల్లుతున్న టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకు మాతృవియోగం కలిగింది. మణిశర్మ తల్లి యనమండ్ర సరస్వతి (88) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. సరస్వతి కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతున్నప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు.

మణిశర్మ తండ్రి వైఎన్ శర్మ నాలుగేళ్ల కిందటే మరణించారు. ఇప్పుడు తల్లి కూడా మరణించడంతో మణిశర్మ శోకసంద్రంలో మునిగిపోయారు. మణిశర్మ బాల్యం నుంచే సంగీతం బాటపట్టడానికి తల్లి సరస్వతి ప్రోత్సాహం ఎంతో ఉంది. కాగా, తల్లిని కోల్పోయిన మణిశర్మకు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
Go Back to Shorts
Manisharma
Mother
Saraswathi
Demise
Tollywood

More Telugu News