'జిన్నా' టీజర్ లాంచ్ ఈవెంట్ రేపే .. ఎక్కడంటే!
- విష్ణు హీరోగా రూపొందుతున్న 'జిన్నా'
- కథానాయికలుగా పాయల్ - సన్నీలియోన్
- రొమాంటిక్ కామెడీ టచ్ తో కూడిన యాక్షన్ ఎంటర్టయినర్
- త్వరలోనే విడుదల చేసే దిశగా సన్నాహాలు
అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి ముందుగా 'గాలి నాగేశ్వరరావు' టైటిల్ అనుకున్నారు. ఆ తరువాత 'జిన్నా'గా టైటిల్ ను ఫిక్స్ చేశారు. రొమాంటిక్ కామెడీ టచ్ తో కూడిన యాక్షన్ ఎంటర్టయినర్ ఇది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.
రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాదులోని AMB సినిమాస్ లో టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. త్వరలోనే ఈ సినిమాను థియేటర్లకు తీసుకుని వచ్చే ఆలోచనలో ఉన్నారు. కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విష్ణుకి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి.