Sensex: దేశంలో మళ్లీ స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

India corona updates
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 6,395 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 6,614 మంది కోలుకోగా... 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 4,44,78,636 చేరుకుంది. వీరిలో 4,39,00,204 మంది కోలుకున్నారు. 

ఇక ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,28,090కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 50,342 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.96 శాతంగా, క్రియాశీల రేటు 0.11 శాతంగా, రికవరీ రేటు 98.70 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,14,27,81,911 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 36,31,977 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News