Allu Arjun: 'పుష్ప 2' టీమ్ రంగంలోకి దిగుతున్నట్టుగా చెప్పిన రష్మిక!

  • సంచలన విజయాన్ని సాధించిన 'పుష్ప'
  • మరో రెండు రోజుల్లో సెట్స్ పైకి సీక్వెల్ 
  • పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం  
  • వచ్చే ఏడాదిలో విడుదల
Pushpa 2 movie update

ఒక వైపున తెలుగు .. మరో వైపున కన్నడ .. హిందీ సినిమాలతో రష్మిక ఫుల్ బిజీగా ఉంది. హిందీలో అమితాబ్ కూతురుగా ఆమె చేసిన 'గుడ్ బై' సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంలో రష్మిక మాట్లాడుతూ అమితాబ్ గారితో కలిసి నటించాలనే తన కల నిజమైందంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలోనే 'పుష్ప 2' సినిమాను గురించి రష్మిక ప్రస్తావించింది. పుష్ప 2' సినిమా మరో రెండు రోజుల్లో సెట్ పైకి వెళుతున్నట్టుగా ఆమె చెప్పింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఆనందాన్ని కలిగించే విషయమే. మొత్తానికి 'పుష్ప 2' సెట్స్ పైకి వెళ్లే సమయం దగ్గరికి వచ్చేసిందన్న మాట.

'పుష్ప' 350 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఒక్క హిందీలోనే ఈ సినిమా 100 కోట్లకి పైగా కొల్లగొట్టింది. దాంతో ఈ సారి పాన్ ఇండియా స్థాయిలోనే 'పుష్ప 2' సినిమాను నిర్మిస్తున్నారు. ఇతర భాషల నుంచి మరికొంతమంది స్టార్స్ ను తీసుకుంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

More Telugu News