పవన్ కల్యాణ్ పవర్ అలాంటిది మరి.. రీ రిలీజ్లోనూ రికార్డు బద్దలు
- పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 1న ‘జల్సా’ రీ రిలీజ్
- ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.20 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రం
- రూ. 1.73 కోట్లు రాబట్టిన ‘పోకిరి’ రీ రిలీజ్ రికార్డు బద్దలు కొట్టిన ‘జల్సా’
ఈ చిత్రం నైజాం ప్రాంతం నుంచి సుమారుగా రూ. 1.2 కోట్లు వసూలు చేయగా, ఉత్తరాంధ్రలో రూ. 26 లక్షలు రాబట్టింది. కృష్ణాలో రూ. 21 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ. 14 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షల కలెక్షన్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా రూ 2.35 కోట్ల గ్రాస్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా కలిపి రూ 3.20 కోట్లు వచ్చినట్టు లెక్కగట్టారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్‌లకు ‘జల్సా’ ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ సంజయ్ సాహూ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయన సరసన ఇలియానా, పార్వతి మెల్టన్ హీరోయిన్లుగా నటించారు.