'మెగా బ్లాక్ బస్టర్'లో రోహిత్ శర్మ, గంగూలీ?
Add ap7am to your home Screen

'మెగా బ్లాక్ బస్టర్'లో రోహిత్ శర్మ, గంగూలీ?

Rohit sharma in Bollywood movie
  • దీపిక పదుకొణే, రష్మిక మందన్న, త్రిష కూడా 
  • ప్రాజక్టుకు సంబంధించిన పోస్టర్ల విడుదల
  • ఈ నెల 4న విడుదల కానున్న ట్రైలర్
  • సినిమానా? టీవీ షోనా? అనేది సస్పెన్స్  
ఇన్నేళ్ల పాటు క్రికెట్ గ్రౌండ్ లో దుమ్ము రేపిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... ఇప్పుడు తెరపై కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. 'మెగా బ్లాక్ బస్టర్' అనే ప్రాజక్టులో రోహిత్ శర్మ కీలక పాత్రను పోషించబోతున్నాడు. ఇందులో బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, తమిళ హీరో కార్తీ, హీరోయిన్లు దీపిక పదుకొణే, రష్మిక మందన్న, త్రిష కూడా నటిస్తున్నారు. 

ఈ ప్రాజక్టుకు సంబంధించిన పోస్టర్లను తాజాగా విడుదల చేశారు. ఈ నెల 4న దీని ట్రైలర్ విడుదల కాబోతోంది. అయితే, ఇది సినిమానా? లేక ఏదైనా టీవీ షోనా? అనేది సస్పెన్సుగా ఉంచారు. పైగా టీవీ ప్రెజంటర్ కపిల్ శర్మ కూడా ఈ ప్రాజక్టులో కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్లలో ట్రైలర్ రిలీజ్ డేట్ తప్ప మరే వివరాలు లేకపోవడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. దీంతో, దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైన తర్వాత మాత్రమే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం రోహిత్ శర్మ యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్ లో ఆడుతున్నాడు.
Rohit Sharma
Sourav Ganguly
Bollywood

More Telugu News