'లైగర్' సినిమా కోసం మైక్ టైసన్ అన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడా?
Add ap7am to your home Screen

'లైగర్' సినిమా కోసం మైక్ టైసన్ అన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడా?

Mike Tyson took Rs 23 Cr remuneration for Liger movie
  • రూ. 90 కోట్లతో తెరకెక్కిన 'లైగర్'
  • బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ చిత్రం
  • టైసన్ రూ. 23 కోట్లు తీసుకున్నాడని ప్రచారం  
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'లైగర్' సినిమాకు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. బాక్సర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని చాలా మంది భావించారు. ఈ సినిమాకు చేసిన ప్రమోషన్లు కూడా ఓ రేంజ్ లోనే ఉన్నాయి. ప్రమోషన్ల సందర్భంగా ప్రతి సిటీలో హీరో, హీరోయిన్లకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అయితే, ఇవేవీ కూడా వారిని థియేటర్ల వరకు తీసుకురాలేకపోయాయి. విడుదలయ్యాక తొలి ఆటతోనే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ తర్వాత కోలుకోలేదు. 

ఇక ఈ సినిమాను దాదాపు రూ. 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారని చెపుతున్నారు. దీంతో, కలెక్షన్ల పరంగా చూస్తే ఈ సినిమా భారీ నష్టాలనే మిగిల్చినట్టయింది. మరోవైపు ఈ సినిమాలో నటించిన ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చారట. టైసన్ ఏకంగా రూ. 23 కోట్లు తీసుకున్నాడని ఓ వార్త వైరల్ అవుతోంది. అంటే మొత్తం పెట్టుబడిలో టైసన్ ఖర్చే ఎక్కువ అనుకోవచ్చు.
Liger Movie
Tyson
Remuneration
Tollywood
Bollywood

More Telugu News