Aaradhya: వినాయకుడి ప్రతిమ, 21 రకాల పత్రులు, 28 రకాల పూజ వస్తువులు.. ఒకే క్లిక్ తో 'ఆరాధ్య' వినాయక పూజ కిట్!

  • పూర్తి సురక్షితమైన పూజా సామగ్రిని అందిస్తున్న 'ఆరాధ్య'
  • ఆరేళ్లుగా భక్తుల అభిమానాన్ని చూరగొంటున్న ఆన్ లైన్ సంస్థ
  • ఒక్కో కిట్ ధర రూ. 1,200 మాత్రమే
  • ఆన్ లైన్, ఫోన్ ద్వారా కిట్ ను బుక్ చేసుకునే అవకాశం
  • పూజ ఎలా చేసుకోవాలనే వీడియోను కూడా ఆన్ లైన్ ద్వారా అందిస్తున్న 'ఆరాధ్య'
Aaradhya eco friendly Vinayaka pooja kit at one click

తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి సందడి మొదలయింది. కరోనా కారణంగా రెండేళ్ల పాటు వినాయకచవితిని జనాలు పూర్తి స్థాయిలో చేసుకోలేకపోయారు. ఈసారి కరోనా భయాలు తొలగిపోవడంతో భక్తులు ఆనందోత్సాహాలతో, ఘనంగా పండుగ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. హిందువులు వినాయకచవితికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. తమను కష్టాల నుంచి, విఘ్నాల నుంచి గట్టెంకించేది లంబోదరుడే అని హిందువుల నమ్మకం. అందుకే, వినాయకచవితి రోజున గణనాయకుడి ప్రతిమను ఇంట్లో ప్రతిష్ఠించి వివిధ రకాల పువ్వులు, పత్రులతో ఎవరి శక్తి మేరకు వారు భక్తిశ్రద్ధలతో పూజలను నిర్వహిస్తారు. స్వామికి ఉండ్రాళ్లు, కుడుములు, మోదకాలు, లడ్డూలు తదితర పిండి వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. 

అయితే, వినాయకచవితి రోజున స్వామి పూజ అంటే అంత ఈజీ కాదు. స్వామిని ఏయే పత్రులతో పూజించాలో మనలో చాలా మందికి అవగాహన ఉండదు. మార్కెట్ కు వెళ్తే వ్యాపారులు ఏయే పత్రులు అంటగడతారో తెలియదు. వారిచ్చిన పిచ్చిపిచ్చి ఆకులతోనే మనకు తెలియక పూజలు కానిస్తుంటాం. దీంతో, మనకు పూజా ఫలితం పూర్తి స్థాయిలో లభించదు. ఇలాంటి సమస్యల నుంచి భక్తులను గట్టెక్కించడానికి, వారి పూజలు సాంప్రదాయబద్ధంగా, సంపూర్ణంగా పూర్తి కావడానికి తమ వంతు సహకారం అందించేందుకు 'ఆరాధ్య' సంస్థ మరోసారి మన ముందుకు వచ్చింది. వినాయకచవితిని అందరూ సురక్షితంగా, ప్రశాంతంగా, ఎలాంటి లోటు లేకుండా జరుపుకోవడానికి తమ వంతు బాధ్యతగా 'ఆరాధ్య' మరోసారి సన్నద్ధమయింది. 

కేవలం ఒక క్లిక్ తో 12 ఇంచుల ఎత్తున్న అందమైన మట్టి వినాయకుడి ప్రతిమతో పాటు, 21 రకాల పూజ పత్రులు, పూజకు అవసరమైన 28 రకాల వస్తువులను ఆరాధ్య అందిస్తోంది. అంతేకాదు కిట్ లో ఉన్న ఏ పత్రి ఏమిటో అనే విషయం అర్థమయ్యేలా వాటి పేర్లను కూడా వాటికి అతికిస్తోంది. ఒక్కో కిట్ ను రూ. 1,200కు అందిస్తోంది. అంతే కాదు వినాయకుడి పూజను ప్రారంభం నుంచి చివరి వరకు ఎలా చేసుకోవాలో వివరించే వీడియోను కూడా 'ఆరాధ్య' ఆన్ లైన్ ద్వారా అందిస్తోంది. ఈ వీడియో ద్వారా పూజారి లేకుండానే మనం మన ఇంట్లో సొంతంగా ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా పూజను నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.

ఆరాధ్య సంస్థ గత ఏడాది హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, వైజాగ్ ప్రజలకు తన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది బెంగళూరుకు కూడా తన సేవలను విస్తరించింది. ఈ కిట్ లోని వినాయకుడితో పాటు, ప్యాకింగ్ మెటీరియల్ సహా అన్నీ ఎకో ఫ్రెండ్లీ కావడం గమనార్హం. భక్తులకు సంపూర్ణమైన, సురక్షితమైన వినాయకుడి కిట్ ను అందించాలనే తపనతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న వేణుగోపాలస్వామి లంకోతు 'ఆరాధ్య' సంస్థను ప్రారంభించారు. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన 'ఆరాధ్య' అనతికాలంలోనే భక్తుల ఆదరాభిమానాలను చూరగొంది.  
 
ఈ కిట్లను పొందాలనుకునే వారు ఆన్ లైన్ ద్వారా లేదా ఫోన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. www.aaradhya.in వెబ్ సైట్లోకి లాగిన్ అయి కిట్ ను బుక్ చేసుకోవచ్చు. లేదా 9494563839, 9849610015 నంబర్లకు ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కిట్లను బుక్ చేసుకున్న వారు కింద పేర్కొన్న పికప్ పాయింట్ల నుంచి కిట్లను తీసుకోవచ్చు.

పికప్ పాయింట్ల వివరాలు ఇవే:

హైదరాబాద్:

  • జూబ్లీహిల్స్ -  టీ3, థర్డ్ ఫ్లోర్, గ్రీన్ వ్యూ ప్లాజా, రోడ్ నంబర్ 1 & 68
  • మణికొండ - మర్రిచెట్టు జంక్షన్ వద్ద
  • గుడిమల్కాపూర్ - సత్య శోభ అపార్ట్ మెంట్, శారదానగర్ కాలనీ
  • కొండాపూర్ - గ్రీన్ టెర్రేసెస్ అపార్ట్ మెంట్స్, వైట్ ఫీల్డ్స్
  • అమీర్ పేట్ - శ్రీ వాసవి ప్రింటర్స్, ఫస్ట్ ఫ్లోర్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా
  • కూకట్ పల్లి - ప్లాట్ నంబర్ 153, రోడ్ నంబర్ 24, వివేకానందనగర్ కాలనీ
  • నిజాంపేట్ - ప్లాట్ నంబర్ 29 & 30, షాప్ నంబర్ 2, సాయిరత్న, శ్రీనివాసనగర్ కాలనీ
  • చందానగర్ - సంగం డెయిరీ పార్లర్, రైల్వే స్టేషన్ రోడ్, ఐసీఐసీఐ ఏటీఎం పక్కన
  • సికింద్రాబాద్ - రైల్ నిలయం పక్కన
  • నాచారం - రిలయన్స్ డిజిటల్ వద్ద, రవీంద్రనగర్
  • ఈసీఐఎల్ - ఏసియన్ రాధిక మల్టిప్లెక్స్ వద్ద, డాక్టర్ ఏఎస్ రావు నగర్ రోడ్
  • కొత్తపేట - విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ వద్ద
  • రామంతాపూర్ - గుప్తా గార్డెన్స్ వద్ద
  • సుచిత్ర - సుచిత్ర క్రాస్ రోడ్స్ వద్ద
  • నల్లగండ్ల - రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద
  • ఆర్టీసీ క్రాస్ రోడ్స్ - ఆర్టీసీ కల్యాణమంటపం వద్ద
విజయవాడ:
  • ఎంజీ రోడ్ - ఫార్మా జనరిక్ హౌస్ వద్ద, రాఘవయ్య పార్క్ రోడ్, గోల్డెన్ పెవిలియన్ ఎదురుగా, గవర్నర్ పేట
  • తాడేపల్లి - ఉషోదయ సూపర్ మార్కెట్ వద్ద
విశాఖపట్నం:
  • ఎన్ఏడీ కొత్త రోడ్డు, ఎన్ఏడీ జంక్షన్
  • డెయిరీ ఫామ్, ఆంజనేయస్వామి విగ్రహం వద్ద
  • మాధవధార, ఈస్ట్ పార్క్ వద్ద
మంగళగిరి - డీటీడీసీ కార్యాలయం వద్ద
గుంటూరు - విద్యానగర్

బెంగళూరు- కింది ప్రాంతాల్లో ఉన్న 'మార్నింగ్ స్టార్' ట్రావెల్స్ కార్యాలయాల్లో కిట్లు లభిస్తాయి.
  • కేఆర్ పురం
  • మారతహల్లి
  • మడివాళ
  • ఆనంద్ రావ్ సర్కిల్.





More Telugu News