Mahesh Babu: మహేశ్ మూవీ కోసం రెడీ అవుతున్న పూజ హెగ్డే!

  • వరుస ఫ్లాపులలో ఉన్న పూజ హెగ్డే 
  • మహేశ్ 28వ సినిమాలో ఛాన్స్ 
  • 'మహర్షి' తర్వాత ఆయనతో చేస్తున్న సినిమా 
  • వచ్చేనెలలో రెగ్యులర్ షూటింగ్
Pooja Hegde in Trivikram movie

తెలుగులో పూజ హెగ్డే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆ మధ్య వరుసగా భారీ విజయాలను అందుకుంటూ వచ్చిన పూజ హెగ్డే, ఈ మధ్య వరుసగా భారీ పరాజయాలను ఫేస్ చేస్తూ వచ్చింది. 'రాధేశ్యామ్' .. 'బీస్ట్' .. 'ఆచార్య' సినిమాలు ఆమె సక్సెస్ గ్రాఫ్ కి గండి కొట్టాయి. ఈ పరాజయాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి.

దాంతో కొన్ని రోజులుగా విదేశాల్లో విహరిస్తూ ఆ ఫ్లాపులను మరిచిపోవడానికి ట్రై చేసిన పూజ హెగ్డే, మహేశ్ సినిమా షూటింగులో జాయిన్ కావడానికి రెడీ అవుతోందని సమాచారం. మహేశ్ బాబు తన 28వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. వచ్చేనెల ఆరంభంలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 

సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజ హెగ్డేకి ఇది మూడో సినిమా కాగా, మహేశ్ బాబుతో రెండో సినిమా. ఇద్దరి కాంబినేషన్లో హిట్స్ ఉండటం వలన, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మరో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ పేరు వినిపిస్తోంది.

More Telugu News