Vaishnav Tej: రేపు రానున్న 'రంగ రంగ వైభవంగా' టైటిల్ సాంగ్!

  • గిరీశాయ రూపొందించిన 'రంగ రంగ వైభవంగా'
  • ఫ్యామిలీ ఎంటర్టయినర్ జోనర్లో సాగే కథ 
  • వైష్ణవ తేజ్ జోడీగా కేతిక శర్మ
  • వచ్చేనెల 2న రిలీజ్ అవుతున్న సినిమా
Ranga Ranga Vaibhavanga movie update

వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశాయ దర్శకత్వంలో 'రంగ రంగ వైభవంగా' సినిమా రూపొందింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. వైష్ణవ్ తేజ్ జోడీగా కేతిక శర్మ నటించింది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఈ సినిమా నుంచి ఒక్కో పాటను వదులుతూ వస్తున్నారు. అలా ఈ సినిమా నుంచి రేపు ఉదయం 10 గంటలకు టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. పండగ వాతావరణాన్ని ప్రతిబింబించే ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఫ్యామిలీ ఎమోషన్స్ తో ముడిపడిన ప్రేమకథ ఇది. ఈ సినిమాలో అక్కడక్కడా పవన్ ను వైష్ణవ్ ఇమిటేట్ చేశాడనే విషయం అర్థమవుతూనే ఉంది. పవన్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2వ తేదీనే ఈ సినిమాను విడుదల చేయనుండటం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది వైష్ణవ్ కీ .. కేతిక శర్మకు మూడో సినిమా కావడం విశేషం.

More Telugu News