Allari Naresh: 'ఉగ్రం' నుంచి అల్లరి నరేశ్ ఫస్టులుక్ పోస్టర్!

Ugram First Look Poster Released
షార్ట్స్‌లో చూడండి
అల్లరి నరేశ్ హాస్య కథానాయకుడిగా చకచకా 50 సినిమాలను పూర్తి చేసుకున్న హీరో. అప్పుడప్పుడు ఆయన విలక్షణమైన పాత్రలను కూడా చేస్తూ తన సత్తా చాటుకున్నాడు. అలా ఆ మధ్య వచ్చిన 'నాంది' సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. నూతన దర్శకుడు విజయ్ కనకమేడలకు ఈ సినిమా మంచి పేరు తీసుకుని వచ్చింది. 

అదే దర్శకుడితో అల్లరి నరేశ్ ఇప్పుడు 'ఉగ్రం' సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా నుంచి కొంత సేపటి క్రితం ఆయన పోస్టర్ ను రిలీజ్ చేశారు. వీపులో దిగబడిన 'కత్తి'తో .. రక్తసిక్తమైన శరీరంతో .. ఆవేశం .. ఆక్రోశంతో హీరో అరుస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. మొత్తానికి టైటిల్ కి తగిన పోస్టర్ వదిలారు. 

సాహు గారపాటి -  హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమాకి, శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు. 'నాంది' తరువాత అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. 'నాంది' స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ప్రభావితం చేస్తుందేమో చూడాలి..
Go Back to Shorts
Allari Naresh
Vijay Kanakamedala
Ugram Movie

More Telugu News