అభ్యంతరకరంగా దేవుళ్ల ఫొటోల విక్రయాలు.. అమెజాన్ పై ఫిర్యాదు
- రాధా కృష్ణుల అభ్యంతరకార ఫొటోల విక్రయాలు
- అమెజాన్ పై బెంగళూరులో పోలీసులకు ఫిర్యాదు
- ఎక్సోటిక్ ఇండియాపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్
అభ్యంతరకరంగా ఉన్న దేవుళ్ల ఫొటోలు ఎక్సోటిక్ ఇండియా వెబ్ సైట్ లోనూ ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నెల 18, 19 తేదీల్లో దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరగడం తెలిసిందే. వివాదం మొదలైన తర్వాత సంబంధిత వెబ్ సైట్ల నుంచి ఈ ఫొటోలను తొలగించారని హిందూ జనజాగృతి సమితి తెలిపింది.
‘‘కానీ, ఇది చాలదు. అమెజాన్, ఎక్సోటిక్ ఇండియా బేషరతుగా క్షమాపణలు కోరాలి. ఇంకెప్పుడూ హిందువుల మనోభావాలను గాయపరచనంటూ భరోసా ఇవ్వాలి. విలువల్లేని అమెజాన్ తరచుగా జాతీయ, ప్రాంతీయ మత చిహ్నాలను, దేవుళ్లను అగౌరవపరుస్తోంది. అమెజాన్ ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడకుండా భారత్ కఠిన వైఖరి తీసుకోవాలి’’ అని హిందూ జన జాగృతి సంస్థ కోరింది.