ఈ నెల 25న 'జిన్నా' టీజర్ రిలీజ్!
- 'జిన్నా'గా కనిపించనున్న మంచు విష్ణు
- కథానాయికలుగా సన్నీలియోన్, పాయల్
- సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్
- అక్టోబర్ 5వ తేదీన సినిమా విడుదల
తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. హాస్య కథాచిత్రాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న జి.నాగేశ్వర రెడ్డి ఈ సినిమాకి కథను అందించగా, స్క్రీన్ ప్లే - సంభాషణలను కోన వెంకట్ అందించాడు.
ముందుగా 'గాలి నాగేశ్వరరావు' అనే టైటిల్ ను అనుకుని, ఆ తరువాత 'జిన్నా' టైటిల్ ను సెట్ చేసుకున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, సునీల్ .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.