'సలార్'లో ఆయన విలనా? పోలీస్ ఆఫీసరా?
- మలయాళ విలక్షణ నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్
- 'సలార్' కోసం ఆయనను ఎంపిక చేసిన ప్రశాంత్ నీల్
- ఆయన పాత్ర విషయంలో నెలకొన్న ఆసక్తి
- వచ్చే ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన విడుదల
అయితే తన డేట్స్ సర్దుబాటు చేయలేని కారణంగా ఆయన తప్పుకున్నాడనే టాక్ వచ్చింది. ఆ తరువాత 'సలార్' షెడ్యూల్స్ లో జరిగిన మార్పుల వలన, పృథ్వీరాజ్ సుకుమారన్ డేట్స్ సెట్ అయ్యాయి. రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ను మేకర్స్ పృథ్వీరాజ్ సుకుమారన్ కి ట్యాగ్ చేయడంతో, ఆయన ఈ సినిమా చేయడం ఖరారైపోయింది.
అయితే ఈ సినిమాలో ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేయనున్నాడని కొంతమంది అంటుంటే, విలన్ గా కనిపించనున్నాడని మరికొంతమంది చెబుతున్నారు. ఈ రెండు పాత్రలలో ఆయన ఏది చేయనున్నాడనేది తెలియవలసి ఉంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.