తనకి పంపిన రెండు కోట్లు విజయ్ వెనక్కి తిరిగి పంపించాడు: పూరి జగన్నాథ్
- ప్రమోషన్స్ లో బిజీగా 'లైగర్' టీమ్
- విజయ్ నిజాయతీని ప్రస్తావించిన పూరి
- నాకు అప్పుందని తెలిసి డబ్బు పంపేశాడని వెల్లడి
- అతను నెక్స్ట్ లెవెల్ కి వెళతాడంటూ వ్యాఖ్య
ఈ వేదికపై పూరి మాట్లాడుతూ .. 'అర్జున్ రెడ్డి' చూసినప్పుడే విజయ్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. విజయ్ సినిమాల్లోనే కాదు .. బయటకూడా అంతే నిజాయతీగా ఉంటాడు. తనలో నేను ఇష్టపడేది అదే. నిర్మాతగా నేను ఒక రోజున తనకి 2 కోట్లు పంపించాను. మాకు వేరే చోట అప్పు ఉందని తెలిసిన తను, ముందుగా ఆ అప్పు తీర్చమని ఆ డబ్బు వెనక్కి పంపించాడు.
ఈ రోజుల్లో ఇలాంటివాడు ఉంటాడా చెప్పండి? ఒక నిర్మాత కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడేవాళ్లు ఎవరు? విజయ్ లాంటి హీరోను నేను ఇంతవరకూ చూడలేదు. నా కష్టనష్టాలను తనవిగా భావించి అండగా నిలబడిన తనకి హ్యాట్సాఫ్ చెబుతున్నాను. ఈ సినిమా విజయ్ ను తప్పకుండా నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతుందని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.